సౌదీ అరేబియాకు ఎఫ్ 35 యుద్ధ విమానాల అమ్మకానికి అమెరికా ఆమోదం
రిపోర్టర్: సతీష్
స్థలం: అమెరికా
అమెరికా మరియు సౌదీ అరేబియా దేశాల మధ్య 24.3 బిలియన్ డాలర్ల భారీ రక్షణ ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా సౌదీ అరేబియాకు 48 ఎఫ్-35 లైట్నింగ్ II యుద్ధ విమానాలు మరియు వాటికి కావలసిన ఇంజన్లు, సాంకేతిక పరికరాల విక్రయానికి అమెరికా విదేశాంగ శాఖ గురువారం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం గల్ఫ్ ప్రాంతంలో భద్రతను బలోపేతం చేస్తుందని అమెరికా వెల్లడించింది.