భక్తిశ్రద్ధలతో ముగిసిన చామలేడు ఉమామహేశ్వర గణేష్ ఉత్సవాలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: గుర్రంపోడు
గుర్రంపోడు మండలం చామలేడు గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. వేలంలో దోటి రవి జ్యోతి దంపతులు యాభై వేల నూట పదహారు రూపాయలకు లడ్డూ దక్కించుకున్నారు. అర్చకులు కొప్పోజు నాగరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని వారు ప్రార్థించారు.