గోవాలో దారుణం: క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో బాలికపై పోలీసు ఇన్స్పెక్టర్ అఘాయిత్యం
రిపోర్టర్: విజయ్
స్థలం: Goa
గోవా రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఘటనలో మైనర్ బాలికపై పోలీసు ఇన్స్పెక్టర్ వికాస్ దేయ్కర్ లైంగిక దాడకు పాల్పడ్డాడని అధికారులు శనివారం తెలిపారు. క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో రంజిని పాల్యేకర్ అనే మహిళ సహకారంతో ఈ అకృత్యానికి పాల్పడినట్లు వెల్లడించారు. భాతీయ న్యాయ సంహిత మరియు పోక్సో చట్టాల కింద నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ స్పష్టం చేశారు.