గవర్నర్ చేతుల మీదుగా ఏటూరునాగారం విద్యార్థినికి అరుదైన సత్కారం

రిపోర్టర్: శివ స్థలం: ములుగు

ఏటూరునాగారం జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని కే.కృష్ణ పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంక్, ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. 2025-26 విద్యా సంవత్సరంలో 589 మార్కులు సాధించిన ఆమెను శ్రీరామ్ సంస్థ ఆధ్వర్యంలో రేపు గవర్నర్ చేతుల మీదుగా రూ.2 లక్షల నగదు బహుమతితో సత్కరించనున్నారు.