అమెరికా సెనేటర్ మిచ్ మెక్కనెల్ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన
రిపోర్టర్: కిరణ్
స్థలం: World
అమెరికా సెనేటర్ మిచ్ మెక్కనెల్ ఆరోగ్యం మరియు ప్రస్తుత పరిస్థితిపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాషింగ్టన్‌లోని ఆయన నివాసం వద్ద క్యాపిటల్ పోలీసులు మోహరించడం కలకరం రేపింది. జూన్ 14న పడిపోయినప్పటి నుంచి ఆయన సెనేట్‌కు దూరంగా ఉంటున్నారు. అనారోగ్య సమస్యల కారణంగా ఆయన సుదీర్ఘకాలంగా విశ్రాంతి తీసుకుంటుండగా, తాజా పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.