మైదానంలో అద్భుత రనౌట్ తో చెలరేగిన టీమిండియా స్టార్ రోహిత్ శర్మ

రిపోర్టర్: సతీష్ స్థలం: ఆక్లాండ్

టీమ్ ఇండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ మైదానంలో తన అద్భుతమైన ఫీల్డింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో రోహిత్ శర్మ మెరుపు వేగంతో స్పందించి డైవ్ చేస్తూ చేసిన రనౌట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రోహిత్ శర్మ ఫిట్ నెస్ ను మెరుగుపరుచుకుని కుర్రాళ్ల కంటే వేగంగా కదులుతున్నాడని క్రీడా విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.