నిజామాబాద్‌లో కలుషిత తాగునీరు సరఫరా.. ఆందోళనలో ప్రజలు
రిపోర్టర్: మహేష్
స్థలం: నిజామాబాద్
నిజామాబాద్‌లో అడుగడుగునా లీకేజీలు, అసంపూర్తి పైపులైన్ల పనుల కారణంగా ప్రజలకు కలుషిత తాగునీరు సరఫరా అవుతోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నల్లాల నుంచి రంగుమారిన నీరు వస్తోంది. క్లోరినేషన్‌ను పట్టించుకోని అధికార యంత్రాంగం వైఫర్యంపై నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే లీకేజీలకు మరమ్మతులు చేసి శుద్ధిచేసిన నీటిని అందించాలని డిమాండ్ చేస్తున్నారు.