సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడాన్ని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి లోక్‌సభకు పోటీ చేసినందున ఆయనపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.