టెలికాం రంగంలో సరికొత్త చరిత్ర: కోటి అప్లికేషన్లతో జియో మెగా ఐపీవో సంచలనం

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ చరిత్రలో జియో ప్లాట్ఫామ్స్ మెగా ఐపీవో సరికొత్త సంచలనం సృష్టించిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. పబ్లిక్ ఇష్యూ ముగింపు రోజు ఏకంగా కోటి అప్లికేషన్లను దక్కించుకుని, ప్రపంచంలోనే ఈ స్థాయిలో దరఖాస్తులను అందుకున్న మొట్టమొదటి కంపెనీగా అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పింది. మొత్తం రూ. 30,213 కోట్ల భారీ పరిమాణంతో వచ్చిన ఈ ఐపీవోకు మదుపర్ల నుంచి అపూర్వమైన స్పందన లభించిందని విశ్లేషకులు స్పష్టం చేశారు.