హనుమకొండలో భారీ వర్షం.. జలమయమైన కాలనీలు

రిపోర్టర్: గోపి స్థలం: హనుమకొండ

హనుమకొండ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. ప్రధాన రోడ్లపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. బస్టాండ్, బాలసముద్రం, నైమ్ నగర్, నక్కలగుట్ట ప్రాంతాల్లో నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మురుగు కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.