కేరళలో యువతి అపహరణ, సామూహిక అత్యాచారం: ఐదుగురు నిందితుల అరెస్ట్
రిపోర్టర్: విజయ్
స్థలం: త్రిశ్శూর
కేరళలోని త్రిశ్శూర్లో లాడ్జిలో బస చేసిన యువతిని అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. వివాహితుడైన ప్రియుడితో కలిసి వచ్చిన యువతి గదిలోకి పోలీసుల వేషంలో చొరబడిన దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రియుడి భార్య ఇచ్చిన సుపారీతోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను విడివిడిగా వేర్వేరు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నట్లు త్రిశ్శూర్ ఏసీపీ తెలిపారు.