మర్రిపాడులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో అభ్యర్థుల అవస్థలు
రిపోర్టర్: Darsigunta Naveen
స్థలం: మర్రిపాడు
మర్రిపాడు మండలంలో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది. నామినేషన్ల చివరి రోజు కావడంతో పత్రాలు సమర్పించేందుకు వస్తున్న అభ్యర్థులు, వారి అనుచరులు వర్షం కారణంగా నానాపాట్లు పడ్డారు. ఎన్నికల సందడి నెలకొన్న వేళ జోరువాన అభ్యర్థులకు పెద్ద ఆటంకంగా మారింది.