చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ వ్యాపారుల ఆగడాలు

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని సత్య గణపతి బేకరీలో మైనార్టీ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు కొనుగోలు చేసిన దిల్పసంద్లో బూజు బయటపడటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లేని కుళ్ళిపోయిన ఆహార పదార్థాలను విక్రయిస్తూ చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తనిఖీలు లేకపోవడంతోనే వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే సదరు బేకరీపై కఠిన చర్యలు తీసుకుని, పట్టణంలోని అన్ని ఆహార పదార్థాల షాపులపై తనిఖీలు నిర్వహించాలని ప్రజలు బలంగా అధికారులను డిమాండ్ చేస్తున్నారు.