కెప్టెన్సీ అనుభవాలపై సచిన్ టెండూల్కర్ కీలక వ్యాఖ్యలు: నాటి పరిస్థితులపై స్పష్టత
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప గౌరవమని, అయితే నాటి రోజుల్ లో తనకంటూ పూర్తి స్వేచ్ఛ ఉండేది కాదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తెలిపారు. రెడ్ ఇట్ వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఆయన, తొంభైల దశకంలో భారత క్రికెట్ ఎంతో చీకటి కాలాన్ని ఎదుర్కొందని గుర్తుచేశారు. ఆ కాలంలో బోర్డులో నేటి వలె వృత్తిపరమైన నిపుణత ఉండేది కాదని, కఠిన సవాళ్లను ఎదుర్కొంటూనే జట్టును ముందుకు నడిపించామని సచిన్ టెండూల్కర్ వెల్లడించారు.