రోడ్డు ప్రమాద బాధితులను కాపాడిన ఆటో డ్రైవర్ కు రహవీర్ పురస్కారం
రిపోర్టర్: అశోక్
స్థలం: రాజన్న సిరిసిల్ల జిల్లా
సిరిసిల్ల పట్టణంలో రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రుడిని సకాలంలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్ పోసు శ్రీనివాస్‌ను ప్రభుత్వ రహవీర్ పథకానికి ఎంపిక చేశారు. గోల్డెన్ అవర్‌లో బాధితుడిని ఆసుపత్రికి చేర్చినందుకు గాను త్వరలో ఆయనకు రూ.25 వేల నగదుతో పాటు ప్రశంసాపత్రం అందజేయనున్నారు. ప్రమాద బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఈ పథకం కింద ప్రోత్సాహకాలు అందిస్తోంది.