జూబ్లీహిల్స్ మద్యం దుకాణాల కేటాయింపులో భారీ కుంభకోణం బట్టబయలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో భారీ లాభాల మద్యం దుకాణాన్ని అధికార పక్ష ముఖ్యనేత సన్నిహితుడికి గుట్టుచప్పుడు కాకుండా కట్టబెట్టడంపై ఎక్సైజ్ శాఖలో కలకలం రేగింది. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. బినామీ పేర్లతో దరఖాస్తులు సమర్పించి ఈ దొంగాట నడిపించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ చీకటి బాగోతంపై సచివాలయంలో తీవ్ర చర్చ జరుగుతోంది.