రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై పాక్ యూజర్ అభ్యంతరకర వ్యాఖ్యలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: India

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును లక్ష్యంగా చేసుకుని పాకిస్థానీ సోషల్ మీడియా యూజర్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాష్ట్రపతి రూపురేఖలను కించపరిచేలా పోస్ట్ చేయడంపై భారతీయ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆమె దేశ ప్రథమ పౌరురాలని, సాయుధ దళాల సుప్రీం కమాండర్ అని గుర్తు చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఘాటైన కౌంటర్లు ఇస్తున్నారు.