ఢిల్లీ విద్యార్థులకు శుభవార్త: అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వైద్య సదుపాయాలు ఏర్పాటు
రిపోర్టర్: మహేష్
స్థలం: న్యూఢిల్లీ
ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం ప్రాథమిక వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి ఆశిష్ సూద్ వెల్లడించారు. ఈ ప్రతిపాదిత ప్రణాళిక ద్వారా విద్యార్థులకు అవసరమైన తక్షణ వైద్య సహాయం అందుతుందని, దీని కోసం ఏటా సుమారు నలభై ఎనిమిది కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని ఆయన తెలిపారు. పాఠశాల వేళల్లో గాయపడిన విద్యార్థులకు ఇది ఎంతో ఉపశమనం ఇస్తుందన్నారు.