ఫ్లైదుబాయ్ విమాన ప్రయాణికులను కాపాడిన భారతీయ పైలట్ తెగువకు జి కిషన్ రెడ్డి ప్రశంసలు

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

దుబాయ్ నుండి టెల్ అవీవ్కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానానికి ఎదురైన పెను ప్రమాదాన్ని తప్పించి, 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ సాహసాన్ని కేంద్ర మంత్రి G Kishan Reddy కొనియాడారు. తీవ్రంగా గాయపడినప్పటికీ ఆయన చూపిన అసాధారణ ధైర్యసాహసాలు దేశం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పైలట్ త్యాగనిరతిని ప్రశంసించారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు G Kishan Reddy తెలిపారు.