మోత్కూరులో యమపాశంలా మారిన తెరిచిన మ్యాన్హోల్ పై ప్రజాగ్రహం
రిపోర్టర్: Srinivasulu akavaram
స్థలం: మోత్కూరు
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో పోతాయిగడ్డ హచ్ టవర్ గల్లీలో మ్యాన్హోల్ మూత పగిలిపోవడంతో ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. మూడు అడుగుల లోతు ఉన్న ఈ మ్యాన్హోల్ పై గత పదిహేను రోజులుగా మూత లేకపోవడంతో చిన్నారులు, వాహనదారులు తీవ్ర ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.