సినిమా అప్డేట్: నాగచైతన్య వృషకర్మ చిత్రం నుంచి స్వాగ్ ఆఫ్ అర్జున్ విడుదల

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

అక్కినేని నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ థ్రిల్లర్ వృషకర్మ సినిమాకు సంబంధించి మేకర్స్ ప్రచార వేగం పెంచారు. ఈ చిత్రంలోని స్వాగ్ ఆఫ్ అర్జున్ ఫస్ట్ సింగిల్ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ట్రెజర్ హంటర్ అర్జున్ పాత్రను పరిచయం చేసే ఈ పాటకు అజనీష్ లోక్నాథ్ అదిరిపోయే ట్రెండీ బీట్స్ను అందించారని నిర్మాతలు తెలిపారు.