సీఎం సభకు రాకుంటే జరిమానంటూ మహిళలకు ఆర్పీ వాయిస్ మెసేజ్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: राजన్న సిరిసిల్ల
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభకు మహిళా సంఘాలు కచ్చితంగా హాజరుకావాలని, లేకపోతే ఐదు వందల రూపాయల జరిమానా విధిస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ రిసోర్స్ పర్సన్ వాయిస్ మెసేజ్ పంపినట్టు వార్తలు వెలువడ్డాయి. ఇందిరమ్మ చీరలు కట్టుకొని రావాలని, గ్రూపుల వారీగా హాజరు తీసుకుంటామని ఆ మెసేజ్‌లో హెచ్చరించినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై మహిళా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని స్థానిక వర్గాలు వెల్లడించాయి.