మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ముగిసిన ప్రజావాణి

రిపోర్టర్: గోపి స్థలం: మేడ్చల్ మల్కాజ్‌గిరి

మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ విభాగాల నుంచి మొత్తం 17 అర్జీలు అందాయి. కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ప్రజల నుంచి వినతులను స్వీకరించి, వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎస్టేట్స్, బయోడైవర్సిటీ, శానిటేషన్, హెల్త్ విభాగాలకు సంబంధించిన సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు.