ఆటో డ్రైవింగ్ చేస్తూ సినిమా చూసిన ఘటనపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఫైర్

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్లు వాడటం, హెడ్ఫోన్లు పెట్టుకుని సినిమాలు చూడటంపై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఆటో డ్రైవర్ రెండు ఫోన్లు వాడుతూ సినిమా చూస్తున్న వీడియో వైరల్ కావడంతో ఆయన స్పందించారు. ఇది ప్రయాణికుల పాలిట మృత్యుశకటమని హెచ్చరించారు. క్షమించరాని ఈ నేరంపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సీపీ స్పష్టం చేశారు.