సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా వరకు విశ్రమించబోం: రేవంత్ రెడ్డి సంచలనం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీ అరెస్టును ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ రద్దు, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు కాంగ్రెస్ పార్టీ విశ్రమించబోదని ఆయన స్పష్టం చేశారు. నిరంకుశ వైఖరితో అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ, రాహుల్ నాయకత్వంలో తుది వరకు పోరాడుతామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.