రాజాం డోలపేట ఆలయంలో ఘనంగా ఐదు వేల మందితో అన్నదానం

రిపోర్టర్: RAMESH LAVETI స్థలం: రాజాం

రాజాం మండలం డోలపేట గ్రామంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో రాజాం కమిషనర్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తలు, స్థానికులు మరియు పరిసర ప్రాంతాల నుంచి విచ్చేసిన సుమారు ఐదు వేల మంది భక్తులు ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని భక్తులు కొనియాడారు.