ఎన్నికల సంఘం నియామకాల చట్టాన్ని సవరించాలంటూ వైఎస్ జగన్ డిమాండ్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అమరావతి

కేంద్ర ఎన్నికల సంఘం నియామక విధానంలో తక్షణమే సమూల మార్పులు తీసుకురావాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తితో పాటు ప్రతిపక్ష నాయకుడిని కూడా సభ్యులుగా చేర్చేలా చట్టాన్ని సవరించాలని ఆయన కోరారు. వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలగాలంటే నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండాలని, ఏపీలో ఓటర్ల జాబితా సవరణపై కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని ఆయన తీవ్రంగా ఆరోపించారు.