ముంబైలో కలకలం: నటుడు టైగర్ ష్రాఫ్ నివాసం వద్ద కాల్పుల ఘటన

రిపోర్టర్: శివ స్థలం: ముంబై

ముంబైలో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల ఘటనపై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు పోలీసులు తెలిపారు. అనిల్ పండిట్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గతంలో ఇచ్చిన హెచ్చరికలను నటుడు పట్టించుకోకపోవడం వల్లే ఈ దాడికి పాల్పడ్డామని అందులో పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారందరినీ తదుపరి లక్ష్యంగా చేసుకుంటామని ముంబై చిత్ర పరిశ్రమను ఆ వర్గం తీవ్రంగా హెచ్చరించింది.