దివ్యాంగులు, ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల వేదిక

రిపోర్టర్: Alfa News Desk స్థలం: నరసరావుపేట

నరసరావుపేట కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీలు మరియు దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. శనివారం ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి సత్వర పరిష్కారం పొందాలని ఆమె కోరారు.