విద్యార్థుల భద్రత కోసం ఢిల్లీ పోలీసుల సరికొత్త కార్యక్రమం
రిపోర్టర్: వెంకట్
స్థలం: New Delhi
ఢిల్లీలోని కోచింగ్ హబ్ కరాల్ బాగ్లో విద్యార్థుల భద్రతపై పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. పీజీలు, అద్దె గదుల్లో ఉంటున్న విద్యార్థుల సమస్యలను ఎస్ హెచ్ ఓ కరుణా సాగర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ తీగలు, వర్షపు నీటి నిల్వలు, దొంగతనాల పట్ల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అత్యవసర సమయాల్లో నేరుగా సంప్రదించాలంటూ పోలీసు అధికారి తన ఫోన్ నంబర్ అందజేశారు.