బాపట్ల జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు

రిపోర్టర్: శివ స్థలం: బాపట్ల

బాపట్ల జిల్లాలో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టును రట్టు చేసినట్లు బాపట్ల పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని, వారి నుంచి ముప్పై మూడు లక్షల రూపాయల విలువైన నూట ఎనభై రెండు గ్రాముల బంగారం మరియు వెండి వస్తువులతో పాటు రెండు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. బాపట్ల జిల్లాలో వరుస దొంగతకాలతో ప్రజలు భయాందోళన చెందుతున్న నేపథ్యంలో, నిఘా పెంచి ఈ ముఠాను పట్టుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.