కూటమికి షాకిస్తూ వైయస్సార్సీపీ గూటికి చేరిన నూట ఐదు కుటుంబాలు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: భామిని
పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో తెలుగుదేశం మరియు జనసేన పార్టీలను వీడి సుమారు నూట ఐదు కుటుంబాలు వైయస్సార్సీపీలో చేరాయి. మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి సమక్షంలో వీరందరూ పార్టీ కండువాలు కప్పుకున్నారు. కూటమి ప్రభుత్వ పాలన నచ్చకే తాము పార్టీ మారామని నూతన సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో వైయస్సార్సీపీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.