రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు నాతవరం క్రీడాకారులు: అండగా నిలిచిన పలువురు దాతలు

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నాతవరం

వైఎస్సార్ కడప జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలకు నాతవరం మండలానికి చెందిన ఐదుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారుల ప్రయాణ ఖర్చుల నిమిత్తం చింతకాయల గోవింద్ ఐదు వేల రూపాయలు, ఎంట్రీ ఫీజు కోసం వెలగా వెంకటకృష్ణారావు ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. అలాగే క్రీడాకారులకు దాతలు శెట్టి లోవ, ప్రధానోపాధ్యాయులు కె.సతీష్ క్రీడా దుస్తులు సమకూర్చి క్రీడాకారులలో ఉత్సాహాన్ని నింపారు.