తుపాను నష్టాలపై అధికారుల అప్రమత్తత: రైతన్నలకు కీలక వ్యవసాయ సలహాలు

రిపోర్టర్: శివ స్థలం: Vizianagaram

తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటల రక్షణకు రైతులు తక్షణ చర్యలు చేపట్టాలని భామిని మండల వ్యవసాయాధికారి షేక్ ఆఫ్రిన్ సూచించారు. పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపించి, తగిన ఎరువులు వాడటం ద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చని ఆమె తెలిపారు. మరోవైపు కొత్తవలస మండలంలో దెబ్బతిన్న ఉద్యాన పంటలను ఉద్యాన కళాశాల అధ్యాపకులు డాక్టర్ దీప్తి, డాక్టర్ సుజాత క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు పలు సాంకేతిక సలహాలు అందించారు.