విద్యార్థులకు తీపి కబురు: ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపుల గడువును విద్యాశాఖ పొడిగించినట్లు అధికారులు తెలిపారు. సాధారణ రుసుముతో ఫీజు చెల్లించేందుకు నవంబర్ పదో తేదీ వరకు సమయం ఇచ్చారు. అలాగే వెయ్యి రూపాయల ఆలస్య రుసుముతో నవంబర్ పదిహేడో తేదీ వరకు ఫీజు స్వీకరిస్తామని బోర్డు స్పష్టం చేసింది. ఈ వెసులుబాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫస్ట్, సెకండియర్ విద్యార్థులందరికీ వర్తిస్తుందని అధికారులు పేర్కొన్నారు.