టైగర్ జోన్ పేరిట ప్రజలను వేధించవద్దు: జనసేన జిల్లా అధ్యక్షుడు రాజ్కిరణ్

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారంలో టైగర్ జోన్ పేరిట స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని జనసేన జిల్లా అధ్యక్షుడు రాజ్ కిరణ్ స్పష్టం చేశారు. ఈకో సెన్సిటివ్ జోన్ పరిధిని పది కిలోమీటర్లకు తగ్గించాలని డిమాండ్ చేస్తూ గత 43 రోజులుగా దీక్ష చేస్తున్న శ్రీరాములు భూమ చారికి ఆయన నేరుగా మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్థానికుల సమస్యలను పరిష్కరించకపోతే జనసేన ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు చేపడతామని తీవ్రంగా హెచ్చరించారు.