గుజరాత్లో పెట్టుబడుల కోసం మంత్రి నారా లోకేశ్ సుడిగాలి పర్యటన

రిపోర్టర్: రాము స్థలం: అహ్మదాబాద్

ఆంధ్రప్రదేశ్ను కొత్త పెట్టుబడుల హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో గుజరాత్లోని అహ్మదాబాద్లో మంత్రి నారా లోకేశ్ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. టోరెంట్, వెల్స్పన్, గోకుల్ ఆగ్రోస్ ప్రతినిధులతో సమావేశమైన ఆయన, క్లీన్ ఎనర్జీ, ఫార్మా, ఇండస్ట్రియల్ పార్కుల రంగాలలో భారీ విస్తరణలకు రాష్ట్రాన్ని ఎంచుకోవాలని ఆహ్వానించారు. ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై ప్రభుత్వ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని ఆయా సంస్థల అధిపతులు హామీ ఇచ్చారు.