ముక్కాం బీచ్‌లో స్వచ్ఛ సాగర్ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే మాధవి
రిపోర్టర్: గోపి
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం బీచ్‌లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, సముద్ర తీర ప్రాంతాల పరిశుభ్రత లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీచ్‌ను శుభ్రం చేస్తూ స్థానికులకు, అధికారులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.