వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: బీజేపీ నేతల పిలుపు
రిపోర్టర్: Y.V.RAMANA
స్థలం: ఐనవిల్లి
ఐనవిల్లి మండలంలోని మాగాపువారిపేటలో గురువారం సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని బీజేపీ మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ, జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి వెంకటేశ్వరరావు సందర్శించారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ‘మన ఆరోగ్యం–మన హక్కు’ అంటూ ప్రతిజ్ఞ చేశారు.