ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు

రిపోర్టర్: సురేష్ స్థలం: Chennai

కేంద్ర హోమంత్రి అమిత్ షా ఏజెంట్గా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని, దీనిపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని ఇండియా కూటమి సమావేశంలో నిర్ణయించినట్లు తమిళనాడు కాంగ్రెస్ నేత మానికం టాగూర్ వెల్లడించారు. ఈ మేరకు చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఆయన కేంద్ర తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్ తీరును తప్పుపడుతూ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ విమర్శలపై అధికార పక్షం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.