రియల్ ఎస్టేట్‌లో గొప్పోళ్లందరికీ నేనే తాతను: సీఎం రేవంత్ రెడ్డి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోకాపేట, పుప్పాలగూడలో గజాల్లో కట్టుకున్నవారికంటే తాను ఎకరాల్లో కట్టానని, రియల్ ఎస్టేట్‌లో గొప్పోళ్లందరికీ తాతనని తెలిపారు. తాను రియల్ కింగ్‌నని, అప్పట్లో రియల్ ఎస్టేట్ చేసి ఉంటే వేల కోట్లు సంపాదించేవాడినని స్పష్టం చేశారు. విద్యారంగంపై చర్చ సందర్భంగా జీవో 97పై వస్తున్న అపోహలను తొలగిస్తూ, విద్యార్థులపై ఫీజుల భారం పడదని భరోసానిచ్చారు.