ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు కళ్యాణం కమనీయం జీవితం సినిమా
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రవి లోకిరెడ్డి దర్శకత్వంలో ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం కళ్యాణం కమనీయం జీవితం ఈ నెల 25న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్ర యూనిట్ సినిమా విశేషాలను పంచుకుంటూ, ఇది కుటుంబ మరియు యూత్ ఆడియన్స్‌ను అలరించే చక్కటి ఎంటర్‌టైనర్ అని తెలిపారు.