ఆదర్శ కుటుంబం సినిమా నుంచి నారాయణమ్మ తొలి పాట విడుదల తేది ప్రకటన
రిపోర్టర్: హరి
స్థలం: తెలంగాణ
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆదర్శ కుటుంబం సినిమా నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలోని మొదటి పాటైన నారాయణమ్మ సాంగ్‌ను సెప్టెంబర్ 22న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.