నాధముని చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పుత్తూరు
పుత్తూరు రూరల్ మండలం కశింకుప్పంకు చెందిన టీడీపీ నాయకులు కే. నాధముని ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం వారి స్వగృహానికి వెళ్లిన నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ నాధముని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.