హైదరాబాద్లో సైబర్ మోసగాళ్ల కొత్త పన్నాగు: నీటి బిల్లుల పేరుతో నకిలీ సందేశాల కలకలం

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

నీటి బిల్లుల బకాయిల పేరుతో వస్తున్న నకిలీ సందేశాల పట్ల హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు వినియోగదారులను తీవ్రంగా అప్రమత్తం చేసింది. ఇలాంటి మెసేజ్లు సైబర్ మోసగాళ్ల ట్రాప్ అని, ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. అనుమానాస్పద లింక్లు క్లిక్ చేయడం, ఏపీకే ఫైళ్లు డౌన్లోడ్ చేయడం లేదా రిమోట్ యాక్సెస్ పర్మిషన్లు ఇవ్వడం వల్ల బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.