బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఇంటిపై దాడి అరాచకం
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నాయకులు క్రిశాంక్ ఇంటిపై దాడి చేస్తారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. రేవంత్ రెడ్డి పాలనలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ క్రిశాంక్ ఇంటి గేట్ తలుపులు పగులగొట్టి, అక్రమంగా ఇంట్లోకి చొరబడి దాష్టీకానికి దిగడం అరాచకమని మండిపడ్డారు. కాంగ్రెస్ అవినీతి, అక్రమాలు, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.