అమెరికా వీసా నిబంధనలపై ట్రంప్ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ
రిపోర్టర్: శివ
స్థలం: అమెరికా
అమెరికాలో విదేశీ విద్యార్థులు, జర్నలిస్టుల వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ ట్రంప్ ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనను బోస్టన్ ఫెడరల్ కోర్టు నిలిపివేసింది. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఇచ్చిన కారణాలు అత్యంత బలహీనంగా ఉన్నాయని జడ్జి ఎఫ్. డెన్నిస్ సేలర్ స్పష్టం చేశారు. ఈ తీర్పుతో లక్షలాది మంది విదేశీ విద్యార్థులకు ఊరట లభించింది.