వైకాపా నేతల ఆరోపణలపై కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: సతీష్ స్థలం: నెల్లూరు

వైకాపా నేతలు అనిల్‌కుమార్‌ యాదవ్, ప్రసన్నకుమార్‌రెడ్డి చేస్తున్న అసత్య ఆరోపణలపై నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మండిపడ్డారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిపై నిందలు మోపితే సహించేది లేదన్నారు. అనిల్ క్వార్జ్‌ మైనింగ్ దోపిడీపై 76 మందితో కూడిన జాబితా తమ వద్ద ఉందని, ప్రసన్న అక్రమాల జాతకం త్వరలో బయటపడుతుందని హెచ్చరించారు.