పీఎఫ్ ఖాతాదారులకు తీపి కబురు: వాట్సప్లోనే ఈపీఎఫ్ఓ కొత్త సేవలు ప్రారంభం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఢిల్లీ

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వాట్సప్ సేవలను ప్రారంభించారని అధికారులు తెలిపారు. ఇకపై ఉద్యోగులు ఎలాంటి పోర్టల్స్ ఓపెన్ చేయకుండానే కేవలం వాట్సప్ ద్వారానే పీఎఫ్ బ్యాలెన్స్, పాస్బుక్ వివరాలు సులభంగా తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఈపీఎఫ్ఓ 74వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్ లో ఈ నూతన సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు వారు వెల్లడించారు.