విద్యుత్ కొరతతో ఎండిపోతున్న పంటలు.. జాతీయ రహదారిపై కల్వకుర్తి రైతుల ఆందోళన!
రిపోర్టర్: Anjaneyulu Yadav
స్థలం: కల్వకుర్తి
కల్వకుర్తి నియోజకవర్గంలోని తాండ్ర గేటు సమీపంలో హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై విద్యుత్ కొరతతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఇవాళ భారీ ధర్నా నిర్వహించారు. రోజుకు 6 నుంచి 8 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తుండటంతో చేతికొచ్చిన పంటలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా ఓ రైతు పాట పాడుతూ ఆవేదనను చాటారు. రోజువారీగా 24 గంటల నిరంతర విద్యుత్ అందించే వరకు తమ పోరాటం ఆపేది లేదని రైతన్నలు తేల్చిచెప్పారు. రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.